ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 8:07 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మంథని ఆర్టీసీ డిపో కార్యదర్శిగా కే.కే. రెడ్డి విజయం.

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కే.కే. రెడ్డి.

అర్జున్ సమాచారం | అక్టోబర్ 9 | మంథని డెస్క్.

మంథని ఆర్టీసీ డిపోలో జరిగిన టీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బీజేపీ–40 ఐక్య కూటమి బలపరిచిన అభ్యర్థి కే.కే. రెడ్డి డిపో కార్యదర్శిగా విజయం సాధించారు. ఈ సందర్భంగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కే.కే. రెడ్డిని అభినందించారు.

ఎన్నికల్లో కార్మికులు తనపై నమ్మకంతో విజయం అందించినందుకు కే.కే. రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. కార్మికులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు. కే.కే. రెడ్డి విజయం సాధించడంతో కార్మికులు, నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు పుప్పాల తిరుపతి పాల్గొన్నారు. కే.కే. రెడ్డికి పలువురు నాయకులు అభినందనలు తెలియజేశారు.