ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 6:47 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సాయి సేవలో తరిస్తున్న కౌండిన్య శ్రీశైలం మహాదేవ గురూజీ.

సాయి సేవలో తరిస్తున్న కౌండిన్య శ్రీశైలం మహాదేవ గురూజీ.

అర్జున్ సమాచారం // అక్టోబర్ 4 // మంథని రిపోర్టర్.

ఓం సాయిరాం.. 1997లో ప్రారంభమైన శిరిడీ సాయిబాబా దర్శన ప్రయాణం నేటికీ 29 ఏళ్లుగా కొనసాగుతోంది. ఎక్కడ ఉన్నా సాయినామస్మరణే శరణ్యంగా భావిస్తూ, పలుమార్లు శిరిడీ సాయిబాబాను దర్శించుకున్న కౌండిన్య శ్రీశైలం మహాదేవ గురూజీ సాయి సేవలో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

సాయిబాబాపై ఉన్న భక్తితో 2004లో మంథని మారుముల ప్రాంతం అయినా రామయ్యపల్లి
(బుధవారం పేట) గ్రామంలో శిరిడీ సాయిబాబా ఆలయాన్ని నిర్మించి, అప్పటి నుంచి నేటి వరకు నిరంతరం బాబా సేవలో తరిస్తున్నట్లు తెలిపారు.

మంథని ప్రాంతంలో వాస్తు, జ్యోతిష్య పండితునిగా కూడా శ్రీశైలం మహాదేవ గురూజీ మంచి గుర్తింపు పొందారు. గల్ఫ్ దేశాల్లో సుమారు 13 సంవత్సరాల పాటు ఉన్నత ఉద్యోగం చేసిన ఆయన, స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం ఆధ్యాత్మిక సేవలతో పాటు వాస్తు, జ్యోతిష్య రంగాల్లో ప్రజలకు సేవలందిస్తున్నారు.

సాయిబాబా ఆశీస్సులతో పేదలు, అవసరంలో ఉన్నవారికి తన వంతు సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. “సాయి నామస్మరణ, సేవా భావంతో ముందుకు సాగడమే తన జీవిత లక్ష్యం” అని శ్రీశైలం మహాదేవ గురూజీ పేర్కొన్నారు. ఆయన వెంట భక్తులు.
కలవేన. సదానందం.కన్నూరి ఓదెలు. చెల్లోజు రాజు. తదితరులు పాల్గొన్నారు.