సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్కు కావేరి జ్యోతి ఎంపిక,క్రీడాకారిణికి ఎం.ఆర్. గ్రూప్స్ తరఫున రూ.10,016 ఆర్థిక ప్రోత్సాహకం.
అర్జున్ సమాచారం // అక్టోబర్ 16 // మంథని రిపోర్టర్:
పెద్దపల్లి జిల్లా పాలిమెల మండలానికి చెందిన క్రీడాకారిణి కావేరి జ్యోతి నవంబర్ 2026లో జరగనున్న రెండో సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ ఛాంపియన్షిప్కు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె క్రీడా ప్రతిభను ప్రోత్సహిస్తూ ఎం.ఆర్. గ్రూప్స్ తరఫున రూ.10,016 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. డాక్టర్ కౌటం ఉదయ్ కిరణ్, కృష్ణ కౌశిక్ కలిసి ఈ ప్రోత్సాహకాన్ని అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కావేరి జ్యోతి అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకుని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడల్లో పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగుతూ దేశానికి, తన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాబోయే పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచి పతకాలు సాధించాలని అభిలషించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం అందిస్తే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయని వారు పేర్కొన్నారు. క్రీడాకారుల లక్ష్య సాధనకు సమాజంలోని దాతలు, సంస్థలు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
కావేరి జ్యోతికి ఆర్థిక ప్రోత్సాహకం అందించడం పట్ల క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.