ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 7:50 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కొండా సురేఖ బర్తరఫ్‌

కొండా సురేఖ బర్తరఫ్‌

హైదరాబాద్,  సెప్టెంబర్ 3అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 3.

కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖ బర్తరఫ్ లేఖను గవర్నర్‌కు పంపించారు. రాజీనామాకు కొండా సురేఖ అంగీకరించకపోవడంతో లోక్‌భవన్‌కు సీఎంవో లేఖ పంపించింది. మరోవైపు చిన్నారెడ్డిపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజీనామాకు ససేమిరా అనడంతో బర్తరఫ్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమచారాం. ఇమేరకు ఢిల్లీ అధిష్టానం నుంచి సీఎంవోకు ఆదేశాలుప్లానింగ్ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియమించారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణిని నియమిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.
ససేమిరా అంటున్న సురేఖ
తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆమె కుమార్తె సుస్మిత పటేల్ చేసిన తీవ్ర విమర్శల నేపథ్యంలో, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలని సురేఖను హైకమాండ్ ఆదేశించింది. ఈ పరిణామంతో ఆమె కేబినెట్ నుంచి వైదొలగడం ఖాయమైపోయింది.గత కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆరోపణలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి, అధిష్టానానికి ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదికను, రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పెద్దలు, కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా నేడు సాయంత్రంలోగా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆమె స్వయంగా తప్పుకోని పక్షంలో, తక్షణమే బర్తరఫ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌కు సంబంధించిన సిఫార్సు లేఖ గవర్నర్‌కు చేరినట్లు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.వాస్తవానికి, ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన కొండా సురేఖ దంపతులు, అక్కడి పరిణామాలపై గురువారం మీడియా సమావేశంలో వివరణ ఇవ్వాలని భావించారు. అయితే, వారు స్పందించేలోపే అధిష్టానం ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కొండా సురేఖ అనుచరులు, కార్యకర్తలు ఈ వార్తతో షాక్‌కు గురయ్యారు.
పనిచేయని ఒత్తిడి
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం ఢిల్లీలో జరిగిన పరిణామాలతో ఈ వివాదం పతాక స్థాయికి చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినా తనకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు పంపడమే తప్పని కొండా సురేఖ మరోసారి స్పష్టం చేసినట్లు సమాచారం.పదేళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి ఎలా అంటారని ఆమె ప్రశ్నించినట్లు తెలిసింది. అంతేకాకుండా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలపై వచ్చిన కమీషన్ల ఆరోపణల సంగతేంటని నిలదీసినట్లు చెప్పుకుంటున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి వస్తే తాను పార్టీకి భిన్నమైన వైఖరి తీసుకుంటాననే సంకేతాలు పంపినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఒత్తిడి వ్యూహమా లేక కొండా కుటుంబం వద్ద ‘ప్లాన్ బి’ ఏదైనా ఉందా అనే కోణంలో పార్టీలో చర్చ మొదలైంది.ఇదే సమయంలో, వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. బయటి నుంచి వచ్చిన వారు పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారని, తెలంగాణలో మళ్లీ వైఎస్సార్ పాలన తెస్తామని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అటు ఢిల్లీలో సురేఖ, ఇటు తెలంగాణలో రాజగోపాల్ రెడ్డి ఒకేసారి కీలక వ్యాఖ్యలు చేయడం కాకతాళీయమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.వాస్తవానికి, సీఎంపై తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను సురేఖ మొదట్లోనే ఖండించి ఉంటే వివాదం ఇంత దూరం వచ్చేది కాదని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. భర్తకు ఎమ్మెల్సీ పదవి కోసం మొదలుపెట్టిన ఒత్తిడి వ్యూహం, చివరికి సురేఖ మంత్రి పదవికే ఎసరు తెచ్చిందా అన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.