ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 2:31 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

నాగర్కర్నూల్ జిల్లాలో న్యాయవాది దారుణ హత్యకళ్లలో కారం చల్లి, వేటకొడవళ్లతో నరికి దారుణ హత్య

నాగర్కర్నూల్ జిల్లాలో న్యాయవాది దారుణ హత్య
కళ్లలో కారం చల్లి, వేటకొడవళ్లతో నరికి దారుణ హత్య

నాగర్ కర్నూలు, (అర్జున్ సమాచారం ప్రతినిధి. అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు 1,)

నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లిలో ఆర్ఎంపీ, న్యాయవాదిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న మల్లయ్య(55) తన క్లినిక్లో ఉండగా తమకు ఆరోగ్యం బాగాలేదని గుర్తుతెలియని ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు వచ్చారు. మల్లయ్య కళ్లల్లో కారం చల్లారు. తరువాత  ప్రధాన రహదారిపైకి లాక్కొచ్చి వేటకొడవళ్లతో విచక్షణారహితంగా నరికి చంపారు. దాడిలో మల్లయ్య  అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భూ తగాదాలే హత్యకు కారణమని అనుమానానిస్తున్నారు.