ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 4:17 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చిన్నారిని ఆదుకుందాంమూర్ఛ వ్యాధితో చికిత్స పొందుతున్న నాలుగు నెలల చిన్నారికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి.

హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా చిన్నారిని ఆదుకుందాంమూర్ఛ వ్యాధితో చికిత్స పొందుతున్న నాలుగు నెలల చిన్నారికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి.

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 17: మానవత్వంతో ముందుకు వచ్చి హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఆపదలో ఉన్న చిన్నారిని ఆదుకోవాలని ఆ సంస్థ అధ్యక్షుడు నాలగోని సతీష్ గౌడ్ కోరారు. కమాన్‌పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన సుమాంజలి నాలుగు నెలల కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు దాతల ఆర్థిక సహాయం కోసం హెల్పింగ్ హ్యాండ్స్‌ను సంప్రదించారు. దాతల సహకారంతో తమ వంతు సహాయం అందించేందుకు కృషి చేస్తామని సతీష్ గౌడ్ తెలిపారు. మానవత్వంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి చిన్నారికి చేయూతనిచ్చి, వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. దాతలు తమకు తోచినంత సహాయాన్ని అందించి చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు సహకరించాలని కోరారు. తమ బిడ్డను కాపాడేందుకు ఆర్థిక సహాయం అందించాలని చిన్నారి తల్లిదండ్రులు దాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సహాయం చేయదలచిన దాతలు నాలగోని సతీష్ గౌడ్ 99852 25656 నంబర్‌కు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా తమకు తోచినంత ఆర్థిక సహాయం పంపించాలని కోరారు.