అర్జున్ సమాచారం జులై 25 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో శుక్రవారం కురిసిన భారీ వర్షాలకు జాడి లింగయ్యకు చెందిన నివాస గృహం కూలిపోవడంతో కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎంబరి సజన్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి దుర్గం బ్రహ్మయ్య, కార్యదర్శి పల్లె సత్తయ్య బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు.
తదనంతరం మండల తహసీల్దార్ రాఘవేందర్ రావు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించి, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తగిన పరిహారం మంజూరు చేసేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
దీనిపై స్పందించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమైన సహాయం అందించే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
ఆపద సమయంలో వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎంబరి సజన్ కుమార్ను గ్రామస్థులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.