స్టాండ్ విత్ జెన్సెన్ కు భారీగా మద్దతు.
న్యూయార్క్, నవంబరు 20, (అర్జున్ సమాచారం డెస్క్).
ఎన్విడియా సీఈఓగా జెన్సెన్ హువాంగ్ను తిరిగి నియమించాలంటూ సాగుతున్న ప్రచారానికి టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. 33 ఏళ్ల క్రితం తాను సహ వ్యస్థాపకుడిగా మొదలైన సంస్థకు.
హువాంగ్ రాజీనామా చేసిన 2 రోజుల తర్వాత, ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ మద్దతు తెలిపింది. ఈ పిటిషన్‌పై తాను కూడా సంతకం చేస్తున్నట్లు మస్క్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘స్టాండ్,
విత్ జెన్సెన్’ అనే వాలంటీర్ల వెబ్సైట్ ద్వారా ఎన్విడియా బోర్డుకు రాసిన బహిరంగ లేఖపై ఇప్పటివరకు 43,000 మందికి పైగా సంతకాలు చేయడం విశేషం. ప్రతి 30 సెకన్లకు అప్డేట్ అయ్యే ఈ సైట్.
వివరాల ప్రకారం, సంతకం చేసిన వారిలో 2,980 మంది ప్రస్తుత ఎన్విడియా ఉద్యోగులు, 454 మంది మాజీ ఉద్యోగులు, 24,097 మంది వాటాదారులు, 15,517 మంది ఇతర,
మద్దతుదారులు ఉన్నారు. అయితే ఈ ప్రచారానికి ఎన్విడియా గానీ, హువాంగ్ గానీ మద్దతు ఇవ్వలేదని, సంతకం చేసిన వారి హోదాలు సెల్ఫ్ అటెస్టెడ్ మాత్రమేనని నిర్వాహకులు తెలిపారు.ఎలాంటి సరైన,
విచారణ ప్రక్రియ లేకుండానే హువాంగ్ను తొలగించారని, వివాదంలో ఉన్న మహిళ గూఢచారి అనడానికి బోర్డు ఎలాంటి ఆధారాలు చూపలేదని ఈ లేఖలో పేర్కొన్నారు. కేవలం అనుమానాలు లేదా
పరిచయాల ఆధారంగా జెన్సెన్ నాయకత్వం నుంచి తొలగించడం సరికాదని పేర్కొంటూ, స్వతంత్ర దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయనను తిరిగి ఎన్విడియా సీఈఓగా నియమించాలని లేదా ఆయన
లేకపోవడం సంస్థకు ఎలా మేలు చేస్తుందో పూర్తి వివరాలతో వివరించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రచారంలో మస్క్‌తో పాటు ఎపిక్ గేమ్స్ సీఈఓ టిమ్ స్వీనీ, వై కాంబినేటర్‌కు చెందిన గ్యారీ టాన్, రెప్లిట్
సీఈఓ అమ్జాద్ మసాద్, కోహెరేకు చెందిన ఐడాన్ గోమెజ్, పెట్టుబడిదారుడు గావిన్ బేకర్, బైనాన్స్ సహ వ్యవస్థాపకురాలు యి హి వంటి టెక్ ప్రముఖులు సైతం సంతకాలు చేశారు.మరోవైపు ఎన్విడియా
ఉద్యోగులు సైతం హువాంగ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. సీనియర్ ఇంజనీర్ ఎర్విన్ కూమన్స్ స్పందించారు. హువాంగ్ వ్యక్తిగత జీవితంతో తమకు సంబంధం లేదని, నిబంధనల ఉల్లంఘన జరిగితే
మాత్రమే చర్యలు తీసుకోవాల్సిందే కానీ ఆయనకు న్యాయ విచారణ అవకాశం ఇవ్వాలని కోరారు. తప్పులు చేసిన వారిని ఉద్యోగం నుండి తొలగించకుండా నేర్చుకునే అవకాశం ఇవ్వాలని జెన్సెన్ ఎప్పుడూ
చెప్పేవారని, ఇప్పుడు ఆయనకు అదేవిధంగా మర్యాద ఇవ్వాలని సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఎలియాస్ సేయుమ్ అభిప్రాయపడ్డారు. కాగా, హువాంగ్ పట్ల వ్యతిరేకత లేదా ఎగతాళి చేసే వ్యాఖ్యలున్న
సంతకాలను నిర్వాహకులు తిరస్కరిస్తున్నారు. సంస్థ అంతర్గత సలహా వేదికపై కూడా 1,600 మందికి పైగా ఉద్యోగులు హువాంగ్ రీఎంట్రీకి మద్దతుగా కామెంట్లు పెట్టారని, ఆయన ఎగ్జిట్ అవ్వడాన్ని
సమర్థిస్తూ ఒక్క పోస్ట్ కూడా కనిపించలేదని వైర్డ్ రిపోర్ట్ పేర్కొంది.చైనా కోసం గూఢచర్యం చేస్తోందని అమెరికా నిఘా సంస్థలు అనుమానిస్తున్న మెగాస్పీడ్ ఎగ్జిక్యూటివ్ ఆలిస్ హువాంగ్‌తో మాజీ సీఈవో
జెన్సెన్కు సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై నవంబర్ 8న ఉద్యోగులకు పంపిన మెమోలో తాను తన భార్యకు నమ్మకద్రోహం చేశానని హువాంగ్ అంగీకరించారు. ఆ తర్వాత నేరుగా ఆయనకు
రిపోర్ట్ చేసే ఎన్విడియా హెల్త్‌కేర్ వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో పాటు మరో ఉద్యోగినితో కూడా ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ప్రచారం చేయడంతో నవంబర్ 12న హువాంగ్ ఎన్విడియా
ప్రెసిడెంట్, సీఈఓ, బోర్డు మెంబర్ పదవులకు తక్షణమే రాజీనామా చేశారు.