రిటైర్డ్ సింగరేణి కార్మికుల వైద్యం 8 ల‹లు అధికారులకు 25 లక్షలు ఈ వ్యత్యాసం ఎందుకో?
అర్జున్ సమాచారం సింగరేణి కోల్ బెల్ట్ ప్రతినిధి ఆగస్టు 21
సింగరేణి సంస్థ లో తమ రక్తాన్ని ధారపోసి దేశంలోని ఎన్నో పరిశ్రమలకు జీవనాధారంగా నిలుస్తూ ఉత్పత్తి సాధన కోసం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి దిగిపోయే నాటికి ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్న కార్మికులకు వైద్యం కోసం అందించే కార్డు ఎనిమిది లక్షల పరిమితికి ఉండడం అదే సంస్థలో విధులు నిర్వహించిన అధికారులకు మాత్రం 25 లక్షలు ఉండడం సింగరేణి స్ఫూర్తికి విరుద్ధం కాదా ఒకే లక్ష్యం ఒకే గమ్యం అని చెప్పే సింగరేణి అధికారులు ఈ వ్యత్యాసానికి కారణమేంటో ఒక్కసారైనా ఆలోచించారా ఏ వైద్యానికి వెళ్లిన కార్పోరేట్ ఆసుపత్రిలో లక్షలకు బిల్లులు వేస్తున్నారని భార్యాభర్తలకు ఇద్దరికీ కలిపి ఎనిమిది లక్షల వరకు మాత్రమే పరిమితం చేయడం దారుణమని శుక్రవారం బెల్లంపల్లి సింగరేణి గని కార్మిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఒక సమావేశంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆవేదన వెలిబుచ్చారు దీనిని వెంటనే సవరించాలని సింగరేణి సంస్థను డిమాండ్ చేస్తూ సింగరేణి కార్మికుల ఓట్లతో ప్రజాప్రతినిధులుగా కార్మిక శాఖ మంత్రులుగా కొనసాగుతున్న వారు కూడా ఈ విషయాన్ని పరిశీలించి సవరించేందుకు కృషి చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తూ సంబంధిత మంత్రులకు పార్లమెంటు సభ్యులకు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు కార్యక్రమంలో టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ మనీ రామ్ సింగ్ సింగరేణి గని కార్మిక సంఘం రాష్ట్ర కన్వీనర్ అంబాల మహేందర్ ఏ.ఐ.ఎఫ్ టీ యు కేంద్ర కార్యదర్శి మేకల పోచమల్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు