రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష,
అమరావతి. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 12.
రాయపూడి లోని సి ఆర్ డి ఏ కార్యాలయంలో జరిగిన రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమానికి ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాల కృష్ణా రెడ్డి,చీఫ్ ఇంజినీర్లు,నిర్మాణ సంస్థల ప్రతినిధులు హజరయ్యారు. ఐకానిక్ భవనాల నిర్మాణంపై ప్రధానంగా చర్చ జరిగింది.జీఏడీ టవర్, హెచ్దోగఅ టవర్లు , అసెంబ్లీ నిర్మాణ పనుల పురోగతిని మంత్రికి అధికారులు వివరించారు. ఐదు టవర్ల కు స్టీల్ డయాగ్రిడ్ నిర్మాణం వేగంగా జరుగుతుందని అధికారులు వివరించారు. అసెంబ్లీ నిర్మాణంలో కీలకమైన స్పైర్(ఎత్తైన శిఖరం) నిర్మాణ పనులు వారం రోజుల్లో మొదలు పెడుతున్నట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రెండేళ్లలో ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగంగా చేయాలని మంత్రి నారాయణ సూచించారు.