ఇందారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలుప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి

ఇందారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలుప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్జున్ సమాచారం. సెప్టెంబర్ 14. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా. జైపూర్, సెప్టెంబర్ 14: జైపూర్ మండలం ఇందారం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.ఈ సందర్భంగా గణనాథుడికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని గణపతిని ప్రార్థించారు....