భూ సమస్యలు ఇందిరమ్మ ఇళ్లపై మంత్రుల సమీక్ష.. కొమురం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెల్లడి.
అర్జున్ సమాచారం:అక్టోబర్ 06: స్టాఫ్ రిపోర్టర్ (కొమురం భీమ్).
నిర్మల్ కలెక్టరేట్ వేదికగా రాష్ట్ర మంత్రులు పాంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె. హరిత పాల్గొని, జిల్లా పరిధిలోని తాజా పరిస్థితులను మంత్రులకు వివరించారు. జిల్లాలో ఎదురవుతున్న భూ సమస్యలు, ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఆమె సమగ్ర నివేదికను సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అభివృద్ధిగా అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను, భూ సమస్యలను ఒక నిర్దిష్ట గడువులోగా పరిష్కరించి ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని కలెక్టర్‌ను మరియు ఉన్నతాధికారులను సూచించారు.