ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 3:19 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన నాగినేని జగన్ మోహన్‌రావు

మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన నాగినేని జగన్ మోహన్‌రావు

తల్లి మృతి పట్ల సంతాపం.. కుటుంబానికి మనోధైర్యం చెప్పారు

పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 01

మంథని మాజీ ఉపసర్పంచ్ ఇనుముల సతీష్ కుటుంబ సభ్యులను ముత్తారం మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్ మోహన్‌రావు శనివారం పరామర్శించారు. ఇటీవల సతీష్ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓదార్చారు.

ఈ సందర్భంగా నాగినేని జగన్ మోహన్‌రావు మాట్లాడుతూ మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని, అందరూ వారికి అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు బండం వసంత్‌రెడ్డి, కన్నాల మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి, కాటారం కో-ఆప్షన్ సభ్యుడు జావిద్ ఖాన్, మాచిడి రవితేజ గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఇనుముల సతీష్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.