చిప్పాడలో తప్పిన ముప్పురోడ్డుపై బోల్తా పడిన భారీ ఇసుక లారీ
చిప్పాడ: అర్జున్ సమాచారం డెస్క్ సెప్టెంబర్ 12.
చిప్పాడ సమీప ప్రధాన రహదారిపై శనివారం ఒక భారీ ఇసుక లారీ ఒక్క సారిగా అదుపుతప్పి బోల్తా పడింది లారీ లోడుతో వేగంగా వెళ్తుండగా ఒక్క సారిగా వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లారీ బోల్తా పడిన సమయంలో రహదారిపై ఇసుక పూర్తిగా కుప్పలుగా పేరుకు పోయింది ప్రమాదం జరిగిన సమయంలో లారీ క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్, క్లీనర్‌లకు స్వల్ప గాయా లయ్యాయి. అదృష్టవ శాత్తూ ఆ సమయంలో రహదారిపై ఇతర వాహనాలు ఏవీ పక్కన లేకపోవడంతో పెద్ద ప్రాణా పాయం తప్పింది ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్,క్లీనర్ లను బయటకు తీసి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది భారీ లారీ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో పాటు,టన్నుల కొద్దీ ఇసుక రోడ్డుపై పడి పోవడంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహన దారులకు తీవ్ర అంత రాయం ఏర్పడింది సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచి పోయాయి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు భారీ క్రేన్ల సహాయంతో బోల్తా పడిన లారీని పక్కకు తొల గించేందుకు రహదారిపై ఉన్న ఇసుకను శుభ్రం చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీ కరించేందుకు చర్యలు ముమ్మరం చేశారు అతివేగం, బ్రేక్ ఫెయిల్యూర్లే కారణమా?ప్రాథమిక సమాచారం ప్రకారం ఇసుక లారీలు మితిమీరిన వేగం తో ప్రయాణించడం లేదా అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.