ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 7:15 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ముదిగుంటకు జాతీయ స్థాయి గుర్తింపు..సర్పంచ్ ఆకుల రవికుమార్‌కు ఘన సన్మానం.

ముదిగుంటకు జాతీయ స్థాయి గుర్తింపు..సర్పంచ్ ఆకుల రవికుమార్‌కు ఘన సన్మానం.

అర్జున్ సమాచారం. ఆగస్టు 18. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.

జైపూర్ మండలం: ముదిగుంట గ్రామ పంచాయతీ ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆకుల రవికుమార్‌కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విందుకు ఆహ్వానం అందింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో ముదిగుంట గ్రామ పంచాయతీ చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమానికి గుర్తింపు లభించడం పట్ల జైపూర్ మండల సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జైపూర్ మండల సర్పంచ్‌ల ఆధ్వర్యంలో ముదిగుంట సర్పంచ్ ఆకుల రవికుమార్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, ఇందారం గ్రామ సర్పంచ్ మహమ్మద్ ఫయాజ్‌తో పాటు మండలంలోని పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ముదిగుంట గ్రామ పంచాయతీ సాధించిన ఈ గుర్తింపు జైపూర్ మండలానికే గర్వకారణమని వారు పేర్కొన్నారు. గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ, భూగర్భ జలాల సంరక్షణకు ఇంకుడు గుంతల నిర్మాణం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.