ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 4:08 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడెం ఆలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం…

కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడెం ఆలయంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం…

ఆలయ అభివృద్ధికి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి: ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు….

అర్జున్ సమాచారం ( నవంబర్ 24 )మంచిర్యాల జిల్లా.

దండేపల్లి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని ప్రసిద్ధ గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నూతనంగా నియమితులైన ఆలయ కమిటీ

సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఆలయ ఈఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

నూతన కమిటీ సభ్యులుగా కొక్కిరాల సురేఖ, వంగపల్లి పూర్ణచందర్రావు, మాదంశెట్టి సత్యనారాయణ, సువర్ణం వెంకటరమణ, బొల్లం భీమయ్య, తాండ్ర లింగయ్య, బొలిశెట్టి కిషన్, అక్కల శకుంతల, పుప్పిరెడ్డి బాపురెడ్డి, ఆకుల తిరుపతి, బొద్దున సంధ్యారాణి, గట్టు స్రవంతి, అడ్డగురి రమేష్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ నూతన కమిటీ సభ్యులు ఆలయ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ పవిత్రతను కాపాడుతూ భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.

కార్తీక పౌర్ణమి పర్వదినాన నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఆయన సతీమణి కొక్కిరాల సురేఖ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చిన భక్తులతో దేవస్థాన ప్రాంగణం సందడిగా మారింది.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, లక్షెట్టిపేట మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి-వెంకటస్వామి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు అక్కల వెంకటేశ్వర్లు, రామగిరి బానేష్, సింగిల్ విండో చైర్మన్లు నాగభూషణం, ముత్యాల శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి,

మంచిర్యాల జిల్లా ఆర్జీపీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అర్కాల హేమలత, మంచిర్యాల పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత పాల్గొన్నారు.
వీరితో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, వివిధ స్థాయిల నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.