వెంకటాపూర్‌లో నూతన విద్యుత్ రూపాంతరకం ఏర్పాటు.
ఎనిమిదో వార్డులో విద్యుత్ సరఫరా మరింత మెరుగుదల.
అర్జున్ సమాచారం జులై 07 మంచిర్యాల జిల్లా.ప్రతినిధి:
మందమర్రి: మండలంలోని వెంకటాపూర్ గ్రామం ఎనిమిదో వార్డులో నూతన విద్యుత్ రూపాంతరకాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ సేగ్యం వెంకటేష్ చొరవతో చేపట్టిన ఈ పనుల వల్ల వార్డులో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది.
ఎన్నాళ్లుగానో ఎదురవుతున్న విద్యుత్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూపాంతరకాన్ని ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయని అభిప్రాయం వ్యక్తమైంది.
ప్రజల అవసరాలను గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న గ్రామ సర్పంచ్ సేగ్యం వెంకటేష్‌కు ఎనిమిదో వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.