ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాయాలి.టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ.
మంథని, అక్టోబర్ 8 (అర్జున్ సమాచారం):
జర్నలిస్టులు ప్రజల పక్షాన నిలబడి నిస్పక్షపాతంగా వార్తలు రాయాలని టీయూడబ్ల్యూజే(143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ సూచించారు. గురువారం మంథని ప్రెస్‌క్లబ్‌ను సందర్శించిన ఆయనకు పాత్రికేయులు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ జర్నలిజం విలువలను కాపాడాలని అన్నారు. ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమాజంలో పాత్రికేయుల బాధ్యతను వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలకు, ప్రభుత్వానికి జర్నలిస్టులు వారధిగా నిలవాలని అన్నారు.
కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అంకరి ప్రకాష్, మంథని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు జంజర్ల శంకర్, ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, ఉపాధ్యక్షుడు బర్ల సంపత్‌తో పాటు జర్నలిస్టులు రమేష్, లక్కాకుల నాగరాజు, కంది కృష్ణారెడ్డి, గంధం ఆంజనేయులు, బాసాని సాగర్, మహిమూద్‌ఖాన్, రాజు, లక్ష్మణ్, కిరణ్, మూగ శ్రీకాంత్, పెరుగు రాకేష్, ప్రదీప్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.