ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 8:38 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

తిరుపతి హాస్పిటల్, మంచిర్యాలలో ప్రభుత్వ ఉద్యోగులకు NEHS అమలు తీరును పరిశీలించిన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు

తిరుపతి హాస్పిటల్, మంచిర్యాలలో ప్రభుత్వ ఉద్యోగులకు NEHS అమలు తీరును పరిశీలించిన టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారికి టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు.

మంచిర్యాల:అర్జున్ సమాచారం ప్రతినిధి అక్టోబర్ 11.

తిరుపతి హాస్పిటల్, మంచిర్యాలలో ప్రభుత్వ ఉద్యోగులకు NEHS అమలు తీరును టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు పరిశీలించారు. ఉద్యోగులకు సంబంధించిన NEHS సక్రమంగా పనిచేస్తుందా లేదా అనే విషయంపై ఆయన ఆరా తీశారు.

ఈ సందర్భంగా టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారు మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ NEHS పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంచిర్యాలలోని తిరుపతి హాస్పిటల్‌తో పాటు ఇతర NEHS ఆసుపత్రుల్లోనూ ఈ పథకం 100 శాతం సమర్థవంతంగా అమలవుతోందని తెలిపారు.

టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్ గారి వెంట టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి, కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, రాగి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, మాజీ కార్యదర్శి రామ్మోహన్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సత్యనారాయణ, నరేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.