ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 7:16 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రిటైర్డ్ టీచర్ ని సన్మానించిన అఖిలభారత మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ కమిటీ సభ్యులు

  • ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రిటైర్డ్ టీచర్ ని సన్మానించిన అఖిలభారత మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ కమిటీ సభ్యులు.
  • జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం సెప్టెంబర్ 5:

అఖిలభారత విశ్వకర్మ మహాసభ మంచిర్యాల జిల్లా జన్నారం లో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రిటైర్మెంట్ ఉపాధ్యాయులు మండల గౌరవ అధ్యక్షులు కొండోజు నాగభూషణ చారి గారికి జిల్లా అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ ఆధ్వర్యంలో శాలువా షీల్డ్ తో సన్మానం చేశారు.కండోజు నాగభూషణం చారి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలు శిరస్మరణీయం విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర ఉపాధ్యాయులదేనని వారు అన్నారు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించి మంచి భవిష్యత్తు క్రమశిక్షణ నైతిక విలువలు పెంపొందించడంలో ఉపాధ్యాయుల కృషి ఎంతైనా ఉంటుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులువేయికండ్ల రవి.కార్యదర్శి బండోజు లక్ష్మీనరసయ్య.జిల్లా ఉపాధ్యక్షులు రాగుల రామచంద్రం. ప్రచార కార్యదర్శి హరీష్. గౌరవ సలహాదారు మన్మధ చారి. సంయుక్త కార్యదర్శి పూర్ణ చారి. కోశాధికారి ఉమ్మడి రమేష్. ఎంపీ చారి. పాల్గొన్నారు.