ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 3:37 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

జైపూర్ మండలంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదుకు విశేష స్పందన.

జైపూర్ మండలంలో టీఎన్జీవో సభ్యత్వ నమోదుకు విశేష స్పందన.

మంచిర్యాల:అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 25.

40 మంది నాన్‌ గెజిటెడ్ ఉద్యోగులు సంఘంలో చేరిక – ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టీఎన్జీవో కృషి: జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి.

జైపూర్ మండలంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి నాయకత్వంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న 40 మంది నాన్‌ గెజిటెడ్ ఉద్యోగులు టీఎన్జీవో సంఘంలో సభ్యత్వం తీసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీఎన్జీవో సంఘం ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సంఘం నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు.

మంచిర్యాల జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా ఉద్యోగుల నుంచి మంచి స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లాను సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు. సభ్యత్వ నమోదుతో పాటు ఉద్యోగుల ఐక్యతను మరింత బలోపేతం చేస్తూ రాష్ట్రానికి మంచిర్యాల జిల్లాను ఆదర్శంగా నిలపాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

జిల్లాలోని అన్ని యూనిట్ల పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు నాయకులు, ఉద్యోగులు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, సంఘటిత శక్తిని పెంపొందించడం కోసం టీఎన్జీవో నిరంతరం అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్, కేంద్ర సంఘం కార్యదర్శి పొన్న మల్లయ్య, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, మందమర్రి యూనిట్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖలకు చెందిన ఉద్యోగులు, ఇతర నాన్‌ గెజిటెడ్ ఉద్యోగులు పాల్గొన్నారు.