ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 27 July 2026, 1:42 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ పై పీడీ యాక్ట్ నమోదుపరారీలో వట్టె జానయ్య యాదవ్

టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ పై పీడీ యాక్ట్ నమోదు
పరారీలో వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట, అర్జున్ సమాచారం ప్రతినిధి, జూలై 27.

టీఆర్పీ పార్టీ జనరల్ సెక్రటరీ వట్టె జానయ్య యాదవ్ పై  అధికారులు పీడీ యాక్ట్ నమోదు చేసారు. రూ.73 కోట్ల విలువైన ధాన్యాన్ని వట్టె జానయ్య పక్కదారి పట్టించాడని  విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్ధారించారు. సూర్యాపేట జిల్లా బాలెంల పరిధిలోని వజ్ర రైస్ కార్పొరేషన్, వజ్ర వికాస్ రైస్ మార్ట్లలో రూ.73 కోట్ల విలువైన 29,188 టన్నుల ధాన్యాన్ని వట్టె జానయ్య యాదవ్ మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల వట్టె జానయ్య యాదవ్ కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. వడ్లను అక్రమంగా తరలిస్తున్న లారీలను అదుపులోకి తీసుకుని, రెండు మిల్లులలోని ధాన్యాన్ని సీజ్ చేసారు.