పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఖానాపూర్ ఎమ్మెల్యే :4 లక్షల రూపాయల LOC అందించిన వెడ్మ బొజ్జు పటేల్ :
జన్నారం ప్రతినిధి :అర్జున్ సమాచారం ఆగస్టు 30 :
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం లింగారెడ్డి గారు అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరమైన పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని NIMS ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సకు సుమారు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.4 లక్షల రూపాయల LOC అందించిన వెడ్మ బొజ్జు పటేల్ :
జన్నారం ప్రతినిధి :అర్జున్ సమాచారం ఆగస్టు 30 :
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం లింగారెడ్డి గారు అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరమైన పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని NIMS ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సకు సుమారు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
నిరుపేద కుటుంబానికి చెందిన లింగారెడ్డి గారి పరిస్థితిని తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు, చికిత్సకు అవసరమైన రూ.4 లక్షల మొత్తానికి CMRF ద్వారా LOC మంజూరు చేయించేలా చొరవ తీసుకున్నారు.
పేదల వైద్య అవసరాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే గారి చొరవపై లింగారెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.