ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:58 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రోడ్డు ప్రమాదం లో గాయపడిన వ్యక్తి : స్పందించి ఆస్పత్రికి తరలించిన రామగిరి ఎస్‌ఐ

రోడ్డు ప్రమాదం లో గాయపడిన వ్యక్తి : స్పందించి ఆస్పత్రికి తరలించిన రామగిరి ఎస్‌ఐ

రామగిరి మండలం, అర్జున్ సమాచారం,

నాగేపల్లి ఎక్స్ రోడ్డు వద్ద బైక్ అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని రామగిరి ఎస్‌ఐ శ్రీనివాస్ వెంటనే తన పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.

స్థానికుల కథనం ప్రకారం… మోసం జంపయ్య అనే వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అక్కడకు చేరుకున్న రామగిరి ఎస్‌ఐ శ్రీనివాస్ సమయస్ఫూర్తితో స్పందించారు. క్షతగాత్రుడి పరిస్థితిని గమనించి, ఆలస్యం చేయకుండా వెంటనే తన అధికారిక పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

సమయానికి స్పందించి ప్రాణాపాయం తప్పించిన ఎస్‌ఐ శ్రీనివాస్ ఉదారతపై స్థానిక ప్రజలు, క్షతగాత్రుని కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.