బెల్ట్ షాపులు ఉన్నందుకు కరెంట్ కట్

బెల్ట్ షాపులు ఉన్నందుకు కరెంట్ కట్వరంగల్, జూన్ 29, అర్జున్ సమాచారం జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని నష్కల్ గ్రామం మద్యపాన రహిత గ్రామంగా మారాలని ఇటీవల తీర్మానం చేసుకుంది. అదే లక్ష్యంతో ఒక నిర్ణయాన్ని అమలు చేసింది. గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్న ఆరుగురి ఇళ్లకు అధికారులు విద్యుత్ కనెక్షన్లను పూర్తిగా తొలగించారు. మద్యం రహిత గ్రామం కోసం గతంలో గ్రామసభలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ శాతబోయిన రాజు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా...