ఎయిర్ పోర్టులో వీడియో వాల్ ను పరిశీలించిన ప్రధాని మోడీ
భోగాపురం(అర్జున్ సమాచారం ప్రతినిధి. ఆగస్టు 1.)
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్ ను ప్రధాని మోదీ పరిశీలించారు. వీడియో వాల్లో ప్రదర్శించిన వివిధ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చారిత్రాక అంశాలను ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను ప్రధాని ఆసక్తిగా పరిశీలించారు.
టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో గవర్నర్, సీఎం, డెప్యూటీ సీఎం, సీఎంఆర్ ప్రతినిధులు ఫోటోలు దిగారు. ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ 13,500 మంది గిరిజన మహిళల థింసా నృత్యాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తదితరులు వీక్షించారు.