నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.2 లక్షలు డిమాండ్,
రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబాటు.. పెద్దపల్లిలో ఏసీబీ దాడి.
పెద్దపల్లి:అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 18.
కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దాడిలో చిక్కుకున్న ప్రభుత్వ న్యాయాధికారి.
న్యాయం అందించాల్సిన బాధ్యత కలిగిన ప్రభుత్వ న్యాయాధికారే లంచం ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడటం జిల్లాలో కలకలం రేపింది. కేసులో నిందితులకు
అనుకూలంగా వ్యవహరిస్తానంటూ రూ.2 లక్షలు డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్‌ను కరీంనగర్ ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
బుధవారం పెద్దపల్లిలో కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించారు. లంచం తీసుకుంటున్న సమయంలోనే నిందిత అధికారిని అదుపులోకి,
తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన ప్రభుత్వ న్యాయ వ్యవస్థలో అవినీతి వ్యవహారాలపై మరోసారి చర్చకు దారితీసింది.
రూ.2 లక్షల డిమాండ్.. రూ.1.50 లక్షల స్వీకరణ
ఒక కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ
అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. డిమాండ్ చేసిన మొత్తంలో రూ.1.50 లక్షలు స్వీకరిస్తున్న సమయంలో అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు సమాచారం.