పర్యావరణం ద్వారానే ప్రజాహితం.తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివా.స్వచత సేవా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన బ్యాంకు సిబ్బంది.
కరీంనగర్, అక్టోబర్ 1,అర్జున్ సమాచారం ప్రతినిధి.
పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారానే
ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ అన్నారు.
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా
బ్యాంకు మేనేజర్లు,సిబ్బందితో కలిసి గురువారం స్థానిక సప్తగిరి కాలనీ లోయర్ మానేరు డ్యాం వద్ద మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా గుర్తించాలని ఆయన కోరారు.గాలి, నీరు, నేల మరియు జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం మానవాళి మనుగడకు అత్యంత ముఖ్యమని అన్నారు.మనచుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు.
గ్రామీణ అభివృద్ధిలో టిజీబి పాత్ర…
గ్రామీణ అభివృద్ధిలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముఖ్య భూమిక పోషిస్తున్నదని
రీజనల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రజలు ముఖ్యంగా రైతులకు గ్రామీణ బ్యాంక్ సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కరీంనగర్ రీజియన్ పరిధిలో 59 శాఖల ద్వారా బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు.డిపాజిట్ల సేకరణ,రుణాల మంజూరులో తమ బ్యాంక్ పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పారు.
బ్యాంక్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీనియర్ మేనేజర్(ఆపరేషన్స్) కందుల సుబ్బారావు, సీనియర్ మేనేజర్ బిజినెస్ కే వంశీకృష్ణ,
నోడల్ ఆఫీసర్ జి మౌనిక, చీఫ్ మేనేజర్ జలంధర్ రెడ్డి, రమణారెడ్డి, మేనేజర్లు కొండపలకల వేణుమాధవ్,
ఎం ప్రవీణ్ రెడ్డి వివిధ బ్యాంక్ శాఖల మేనేజర్లు, రీజినల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది
పాల్గొన్నారు.