బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న పుతిన్
బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న పుతిన్ న్యూఢిల్లీ ., అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 11. 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఆయనకు స్వాగతం పలికారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ద్వైపాక్షిక సమావేశాల్లోనూ పాల్గొననున్నారు.