అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన పుట్ట మధూకర్,మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.
అర్జున్ సమాచారం // అక్టోబర్ 5 // కమాన్పూర్ రిపోర్టర్.
కమాన్పూర్ మండల కేంద్రంతో పాటు గుండారం, రొంపికుంట, నాగారం గ్రామాల్లో సోమవారం మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పర్యటించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కమాన్పూర్ మండల కేంద్రంలోని కిష్టంపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అంబీరు రవి కాలు ఇన్ఫెక్షన్తో బాధపడుతుండగా పరామర్శించారు. అలాగే నడుము చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన బోనాల మల్లయ్య అలియాస్ రెడ్డి, అనారోగ్యంతో బాధపడుతున్న నాయిని శ్రీహరిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
గుండారం గ్రామానికి చెందిన రాచకొండ రామాంజనేయులు అలియాస్ అనిల్ దశదిన కార్యక్రమంలో పాల్గొన్న పుట్ట మధూకర్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రొంపికుంట గ్రామానికి చెందిన తౌట రాయమల్లు, ఎం.డి. అజ్మత్ అలీ, తోగరి ఆశలు, వేముల రాజేందర్, నాగారం గ్రామానికి చెందిన ఉప్పరి లచ్చమ్మ ఇటీవల మృతి చెందగా, వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయా కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
అదేవిధంగా నాగారం గ్రామానికి చెందిన పోగుల మల్లికార్జున్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పుట్ట మధూకర్ వెంట కమాన్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు పాల్గొన్నారు.