జగన్ కుటుంబాన్ని పరామర్శించిన పుట్ట మధూకర్

జగన్ కుటుంబాన్ని పరామర్శించిన పుట్ట మధూకర్ అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 18 / రామగిరి డెస్క్: రామగిరి మండలం రామయ్యపల్లె గ్రామానికి చెందిన దేవునూరి జగన్ మృతి చెందడంతో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జగన్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.