ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 8:18 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధుకర్.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. అండగా ఉంటామని భరోసా,

అర్జున్ సమాచారం | అక్టోబర్ 9 | ముత్తారం రిపోర్టర్.

ముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరామర్శించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ నాంశాని సమ్మయ్య సోదరి పెంచల సరోజన ఇటీవల మృతిచెందగా, ఆమె కుటుంబ సభ్యులను పుట్ట మధుకర్ పరామర్శించి ఓదార్చారు. అదేవిధంగా గ్రామానికి చెందిన మండల రాజమ్మ, కలవేన ముగిలి కుటుంబాలను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

అనంతరం ముత్తారం గ్రామంలో ఇటీవల మృతిచెందిన కాట్ల పోశాలు బండ సత్యమ్మ, తోమూల కొమరవెల్లి, పరిగిపండ్ల రాజలింగు కుటుంబాలను ఆయన పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి బాధలో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని పుట్ట మధుకర్ భరోసా ఇచ్చారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పడం, వారికి మనోధైర్యాన్ని కల్పించడం లక్ష్యంగా ఆయన పరామర్శలు కొనసాగించారు.