మల్లారంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన పుట్ట మధూకర్.
అర్జున్ సమాచారం // అక్టోబర్ 4 // మంథని రిపోర్టర్
మంథని మండలం మల్లారం గ్రామంలో ఇటీవల మృతి చెందిన జక్కుల పుల్లయ్య, సాయిని లస్మయ్య కుటుంబాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న ఆకుల రాజేశంను ఆయన పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పుట్ట మధూకర్ వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.