ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 7:11 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

బిభీమారం ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడిగా రామ్ నాయక్.

భీమారం ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడిగా రామ్ నాయక్.

భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 21:

భీమారం మండల ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా బూర్గుపెల్లికి చెందిన దారావత్ రామ్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు అడే ప్రేమ్ సింగ్ ఆయనను నియమించారు.

ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి చేతుల మీదుగా రామ్ నాయక్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామ్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీ సామాజిక వర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం అశోక్, మండల అధ్యక్షుడు బోర్లకుంట శంకర్‌తో పాటు మండల ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.