TGEJAC రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమం లో పాల్గొనడానికి మూకుమ్మడి సెలవులు పెట్టిన ఆర్డీవో కార్యాలయ సిబ్బంది.
మంచిర్యాల.అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 9.
టీజీఈజెఎసి రాష్ట్ర కార్యవర్గం పిలుపుమేరకు సెప్టెంబర్ 10వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనడానికి టీజీఈజెఎసి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ గడియారం శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం మంచిర్యాల సిబ్బంది మొత్తం సామూహిక సెలవులు పెట్టడం జరిగినది. గౌరవ ఆర్డిఓ మంచిర్యాల శ్రీ జి.శ్రీనివాస సార్ గారు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల సాధనలో మేము కూడా సహాయ సహకార అందిస్తామని తెలపడం జరిగింది. దీనికిగాను TGEJAC తరపున కృతజ్ఞతలు చెప్పడం జరిగినది.