రాజాపూర్ వాసులకు ఉపశమనం: ‘అర్జున్’ కథనానికి తక్షణమే స్పందించిన సింగరేణి యాజమాన్యం
అర్జున్ సమాచారం డెస్క్, సెప్టెంబర్ 14 :
పెద్దపల్లి జిల్లా , రామగిరి మండలం, రాజాపూర్ గ్రామ ప్రజలు నీటి ముంపు భయంతో పడుతున్న తిప్పలపై ‘అర్జున్’ పత్రికలో ప్రచురితమైన కథనానికి సింగరేణి అధికారులు వెంటనే స్పందించారు.
ఈ రోజు “రాజాపూర్ ఇళ్లకు ముప్పు” శీర్షికన వెలువడిన వార్త ఆధారంగా సింగరేణి యాజమాన్యం త్వరితగతిన చర్యలు చేపట్టింది. అధికారుల ఆదేశాల మేరకు గ్రామానికి జేసీబీ (JCB) యంత్రాన్ని పంపించి, వర్షపు నీరు ఇండ్ల లోకి వెళ్లకుండా జేసిబి తో కాలువలు తీసి నీరు ఇళ్లలోకి చేరకుండా తాత్కాలికంగా ముంపు ముప్పు తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
తాత్కాలిక చర్యలతో ప్రస్తుతానికి ఉపశమనం లభించినప్పటికీ, సమస్య మళ్లీ తలెత్తకుండా సింగరేణి యాజమాన్యం శాశ్వత పరిష్కారం చూపాలని రాజాపూర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వరద నీరు ఇళ్లలోకి రాకుండా పక్కా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తమ సమస్యను పత్రికా ముఖంగా వెలుగులోకి తెచ్చి, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ‘అర్జున్’ సమాచార పత్రిక యాజమాన్యానికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.