సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్ రూ.10 వేలు ఇవ్వాలిమంథని డివిజనల్ సబ్ కోర్టు న్యాయమూర్తికి వినతిపత్రం
.పెద్దపల్లి ప్రతినిధి, అర్జున్ సమాచార్, ఆగస్టు 21: దేశానికి వెలుగులు అందించేందుకు సింగరేణి బొగ్గు గనుల్లో దశాబ్దాల పాటు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన రిటైర్డ్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కోల్‌బెల్ట్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నూనె రాజేశం ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి రిటైర్డ్ కార్మికులకు కనీస పెన్షన్‌ను రూ.10 వేలకు పెంచాలని కోరుతూ శుక్రవారం మంథని డివిజనల్ సబ్ కోర్టు న్యాయమూర్తి అపర్ణ మల్లాదికి వినతిపత్రం అందజేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెన్షన్‌ను...