శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం: దిగువ ప్రాంత ప్రజలకు హై అలెర్ట్
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం: దిగువ ప్రాంత ప్రజలకు హై అలెర్ట్ రామగుండం (ప్రత్యేక ప్రతినిధి): జూలై 30 కడెం ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడం, అలాగే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన ఉన్న పరివాహక ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ప్రవాహం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రామగుండం విభాగం నం.7...