గండిపేట్ సమీపంలో  రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

గండిపేట్ సమీపంలో  రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతిరంగారెడ్డి, అర్జున్ సమాచారం ప్రతినిధి జూలై29. గండీపేట సమీపంలోని కొల్లూరు నియోపోలిస్ 1 ఏ ఎగ్జిట్ వద్ద నిలిపి ఉంచిన లారీని కారు బలంగా  ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సురేందర్ (19), విద్యార్థిని ప్రణీతి రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బొమ్మలరామారం మండలానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రణీతి రెడ్డి ఏస్ కళాశాల (ఎల్.బి. నగర్)లో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతోంది. పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసారు....