ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 6:22 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు ,అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాఖల మధ్య సమన్వయం.

గణేష్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు ,అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాఖల మధ్య సమన్వయం.

అర్జున్ సమాచారం చెన్నూరు నియోజకవర్గం ప్రతినిధి.

గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు జైపూర్ మండలంలోని వివిధ శాఖల అధికారులతో సోమవారం సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (స్ టీ పి పి )లో ఏ సి పి వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏ సి పి వెంకటేశ్వర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, అగ్నిమాపక ఏర్పాట్లు, రక్షణ చర్యలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్, సీఐ నవీన్ కుమార్, ఎంపీడీవో శ్రీపతి బాపురావు, తహసీల్దార్ వనజారెడ్డి, ఎస్ ఐ భూమేష్, ఫిషరీస్ సూపర్వైజర్ శ్రవణ్, మెడికల్ అధికారి శ్రావ్య, స్ టీ పి పి సింగరేణి అధికారులు, ఫైర్, ఫారెస్ట్ శాఖల అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు