ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 6:26 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ, విద్యార్థులతో కలిసి భోజనం.

టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ, విద్యార్థులతో కలిసి భోజనం.

అర్జున్ సమాచారం చెన్నూర్ నియోజకవర్గ ప్రతినిధి.

జైపూర్, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ బల్ల వెంకటేష్ ఈరోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వంటగదిని సందర్శించి, వంట ప్రక్రియ, ఆహార నాణ్యత, పరిశుభ్రతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలతో మాట్లాడుతూ భోజనం రుచి, నాణ్యతపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వ మెనూ ప్రకారమే ప్రతిరోజూ విద్యార్థులకు భోజనం అందించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో వంట చేయాలని, ఆహార నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యమే ప్రథమ ప్రాధాన్యమని, మధ్యాహ్న భోజన నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
సర్పంచ్ విద్యార్థులతో కలిసి భోజనం చేయడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.