టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ, విద్యార్థులతో కలిసి భోజనం.
టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ ఆకస్మిక తనిఖీ, విద్యార్థులతో కలిసి భోజనం. అర్జున్ సమాచారం చెన్నూర్ నియోజకవర్గ ప్రతినిధి. జైపూర్, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని టేకుమట్ల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ బల్ల వెంకటేష్ ఈరోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వంటగదిని సందర్శించి, వంట ప్రక్రియ, ఆహార నాణ్యత, పరిశుభ్రతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చుని మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలతో మాట్లాడుతూ భోజనం రుచి, నాణ్యతపై వారి అభిప్రాయాలను...