పి‌డి‌ఎస్ బియ్యం పట్టివేత – ఇద్దరిపై కేసు నమోదు

పి‌డి‌ఎస్ బియ్యం పట్టివేత – ఇద్దరిపై కేసు నమోదు భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 06 : పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పి‌డి‌ఎస్) బియ్యం భారీగా పట్టుబడింది. ఆదివారం (సెప్టెంబరు 6, 2026) భీమారం గ్రామ శివార్లలోని జోడువాగు వద్ద తనిఖీలు చేపట్టగా ఈ అక్రమ రవాణా వెలుగుచూసింది. TS-19-TA-4511, TS-10-UC-7848 రిజిస్ట్రేషన్ నంబర్లు గల రెండు బొలెరో పికప్ వాహనాల్లో తరలిస్తున్న సుమారు 70 క్వింటాళ్ల పి‌డి‌ఎస్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు....