ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 7:17 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత.

సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ కన్నుమూత.

మంథని :ప్రెస్ క్లబ్‌లో విషాద ఛాయలు.. జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి.

అర్జున్ సమాచారం, నవంబర్ 1.మంథని రిపోర్టర్.

మంథని, నవంబర్ 1: మంథని ప్రెస్ క్లబ్ సీనియర్ సభ్యుడు, సీనియర్ జర్నలిస్ట్ పెండ్యాల రామ్ కుమార్ (47) అనారోగ్యంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో మంథని జర్నలిస్ట్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

విద్యార్థి దశ నుంచే పలు సామాజిక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న రామ్ కుమార్, అనంతరం మంథని కేంద్రంగా సుదీర్ఘకాలం వివిధ దినపత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, పేద ప్రజల గొంతుకగా నిలిచారు. ప్రజల సమస్యలను అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. సామాజిక స్పృహ, నిజాయితీ, నిర్భయ జర్నలిజం ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. మంథనిలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో ఆయన క్రియాశీలకంగా పాల్గొన్నారు.

ఆయన మృతి పట్ల మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్, ఉపాధ్యక్షుడు బర్ల సంపత్, ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య, సహాయ కార్యదర్శి గంధం అంజిబాబు, కోశాధికారి తగరం రాజుతో పాటు సీనియర్ జర్నలిస్టులు కొమురోజు మారుతి, కొమురోజు చంద్రమోహన్, అంకరి ప్రకాష్, కలవేన సదానందం.కంది కృష్ణారెడ్డి, ఆర్ల బాపు, లక్కాకుల నాగరాజు, బాసాని సాగర్, ఓజ్జల శ్రీనివాస్, లింగాల సురేష్, దొరగోర్ల రవీందర్, కేసారపు రవి తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. రామ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.