ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి.
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి. కారేపల్లి, నవంబర్ 24: అర్జున్ సమాచారం డెస్క్. ప్రయాణ సమయాన్ని తగ్గించి రాకపోకలను సులభతరం చేయాల్సిన ఖమ్మం–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిపై ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారికంగా ప్రారంభించకముందే వాహనాల రాకపోకలకు అనుమతించడంతో నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయి. అయితే వరుస ప్రమాదాలు, ప్రాణనష్ట ఘటనలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా వైరా మండల పరిధిలోని హైవే ఎగ్జిట్ వద్ద కారు–లారీ ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందగా, వారి...