మారుతున్న జాతీయ సమీకరణాలు.
విశ్లేషణ) అర్జున్ సమాచారం డెస్క్ నవంబర్ 25.
వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాత మిత్రులైన భారతీయ జనతా పార్టీ, శిరోమణి అకాలీదళ్ ఆరేళ్ల తర్వాత మళ్లీ ఒక్కటయ్యాయి. గురుపూర్ణిమ పర్వదినాన బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, హో మంత్రి అమిత్ షా, అకాలిదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ కలిసి పొత్తు విషయమై ప్రకటన చేశారు. దీంతో పంజాబ్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమైంది. 24 ఏళ్లపాటు బీజేపీతో కలిసి నడిచిన అకాలీదళ్.. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ 2020లో ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగింది.పాత స్నేహితులైన బీజేపీ, అకాలీదళ్ మళ్లీ ఒక్కటవుతున్నాయని గత వారం రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీన్ని నిజం చేస్తూ సిక్కులు పవిత్రంగా భావించే గురునానక్ జయంతి రోజున ఈ రెండు పార్టీలు పొత్తు ప్రకటన చేశాయి. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే విషయమై ప్రకటన చేయకపోయినప్పటికీ, ఎన్డీయే సీఎం అభ్యర్థిగా బడా భాయ్ (బాదల్) ఉంటారని అమిత్ షా హింట్ ఇచ్చారు. పాత మిత్రుడైన అకాలీదళ్ తిరిగి ఎన్డీయేలో చేరడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్పందిస్తూ.. హిందూ-సిక్కు సోదరభావానికి తమ పొత్తు సంకేతమన్నారు.‘బాదల్ సాబ్‌కు మాతో గాఢమైన, సుదీర్ఘ అనుబంధం ఉంది. అదేవిధంగా బీజేపీ, అకాలిదళ్ మధ్య బలమైన బంధం ఉంది. ఈ పొత్తు పంజాబ్‌లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా హిందు-సిక్కు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే 2029 డిసెంబర్ నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ నుంచి విముక్తి చేస్తామని షా హామీ ఇచ్చారుబీజేపీ ఏర్పడక ముందు దానికి పూర్వ రూపమైన భారతీయ జన్‌సంఘ్‌తో 1967లోనే అకాలీదళ్ పొత్తు పెట్టుకుంది. ఆ ఏడాది బీజేఎస్, అకాలీదళ్ కలిసి అప్పటికి కొత్త రాష్ట్రమైన పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత బీజేపీ, శిరోమణి అకాలీదళ్ మధ్య 1996లో పొత్తు కుదిరింది. 1997లో ఈ రెండు పార్టీలు కలిసి పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మరుసటి ఏడాది అకాలీదళ్ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరింది. అప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య స్నేహం కొనసాగింది. కానీ 2020లో కేంద్రంలోని మోదీ సర్కారు సాగు చట్టాలను అమలు చేయాలని భావించింది. పంజాబ్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మోదీ సర్కారు నిర్ణయంతో విభేదించిన శిరోమణి అకాలీదళ్ 24 ఏళ్ల స్నేహాన్ని వదులుకుంది.జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు నిరసనగా ఆరేళ్ల క్రితం ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగిన బీజేపీ అత్యంత పాత మిత్రపక్షం శిరోమణి అకాలీద తిరిగి ఎన్డీఏ గూటికి చేరింది. గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పురబ్ పర్వదినం సందర్భంగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఎన్డీఏలో చేరినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ పరిణామంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ.. బీజేపీ–అకాలీదళ్ పొత్తు పంజాబ్ ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసే సహజమైన భాగస్వామ్యమని, ఇప్పుడు ఎన్డీఏ పరిపూర్ణమైందని ఎక్స్ వేదికగా స్వాగతించారు.రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాల్లోనూ బీజేపీ, శిరోమణి అకాలీదళ్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ కూటమిలో శిరోమణి అకాలీదళ్ పెద్దన్న పాత్ర పోషిస్తుందని, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవి అకాలీదళ్కే దక్కుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. త్వరలోనే ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై తుది చర్చలు జరగనున్నాయని, పంజాబ్‌లో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం, రైతుల సంక్షేమం, హిందూ–సిక్కు ఐక్యతను బలోపేతం చేయడమే ప్రధాన ఎజెండాగా ప్రజల్లోకి వెళ్తామని నాయకులు వెల్లడించారు.1996 నుంచి దశాబ్దాల పాటు కొనసాగిన ఈ రెండు పార్టీల పొత్తు 2020లో తెగిపోవడంతో, 2022 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, అకాలీదళ్ వేర్వేరుగా పోటీ చేసి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌లకు గట్టి పోటీ ఇవ్వాలంటే మళ్లీ కలవడమే ఉత్తమమని ఇరు పార్టీల అగ్రనాయకత్వాలు భావించాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి 100కు పైగా స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని, అధికార ఆప్ పార్టీని సింగిల్ డిజిట్‌కే పరిమితం చేస్తామని సుఖ్బీర్ సింగ్ బాదల్ ధీమా వ్యక్తం చేశారు.2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన బీజేపీ, అకాలీదళ్ తీవ్రంగా నష్టపోయాయి. బీజేపీ రెండు సీట్లు మాత్రమే గెలవగా.. అకాలీదళ్ మూడు స్థానాలకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో 92 సీట్లు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అధికారంలోకి వచ్చింది.2024లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం పెరిగినప్పటికీ పంజాబ్‌లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. మరోవైపు అకాలీదళ్ ఓటు బ్యాంక్ ఏకంగా 14 శాతం తగ్గడమే కాకుండా 10 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది.సిక్కులు ఎక్కువగా ఉండే పంజాబ్ గ్రామీణ ప్రాంతాల్లో అకాలీదళ్‌కు గట్టి పట్టు ఉంది. అలాగే హిందువులు ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉంది. కానీ గ్రామీణ ఓటర్ల మద్దతు లేకుండా బీజేపీ అధికారంలోకి రావడం కష్టం. అలాగే పట్టణ ప్రాంత ఓటర్ల సపోర్ట్ లేకుండా అకాలీదళ్ గెలిచే పరిస్థితి లేదు. విడిగా పోటీ చేయడం ద్వారా ఇద్దరమూ నష్టపోతున్నామని బీజేపీ, అకాలీదళ్ గుర్తించాయి. శిరోమణి అకాలీదళ్ పంజాబ్‌లో అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. వరుస ఓటములతో ఆ పార్టీలో చీలికలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీ సైతం పంజాబ్‌లో ఆప్ సర్కారును గద్దె దించాలనే పట్టుదలతో ఉంది. దీంతో ఈ రెండు పార్టీల పొత్తుకు మార్గం సుగమమైంది.పంజాబ్‌లో అకాలీదళ్-బీజేపీది హిట్ జోడీ అని చెప్పొచ్చు. 1997 నుంచి 2017 వరకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు పర్యాయాలు ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయగా మూడుసార్లు (1997, 2007, 2012) అధికారం దక్కించుకున్నాయి. ఈ మూడు పర్యాయాలూ ప్రకాష్ సింగ్ బాదల్ పంజాబ్ సీఎంగా వ్యవహరించారు. 1966లో పంజాబ్ ఏర్పాటైన తర్వాత.. ఆ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి కూటమిగా అకాలీదళ్-బీజేపీ కూటమి నిలిచింది.పంజాబ్‌లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 2022 ఎన్నికల్లో 92 సీట్లు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితమైంది. అకాలీదళ్ 3, బీజేపీ 2 సీట్లు గెలవగా.. బీఎస్పీ, ఇండిపెండెంట్ చెరో సీటు గెలిచారు.2027 ఎన్నికల్లో పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్, అకాలీదళ్-బీజేపీతోపాటు ఎంపీ అమృత్ పాల్ సింగ్ నాయకత్వంలోని కొత్త పార్టీ కూడా బరిలోకి దిగనుంది. మరోవైపు బీజేపీలో ఉన్న మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తిరిగి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.మరోవైపు, అకాలీదళ్ తిరిగి ఎన్డీఏలో చేరడం జాతీయ స్థాయిలోనూ బీజేపీకి వ్యూహాత్మకంగా కలిసిరానుంది. పార్లమెంట్ ముందుకు రానున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆమోదం కోసం ఎన్డీఏకు అదనపు బలం అవసరమైన వేళ అమిత్ షా జరిపిన చర్చలు ఫలించాయని అనుకోవచ్చు.