2026–27 విద్యా సంవత్సరానికి గురుకుల పాఠశాలల ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు ,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.
అర్జున్ సమాచారం ప్రతినిధి మంచిర్యాల ఆగస్టు 17.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న 9 గురుకుల పాఠశాలలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్/సెలక్షన్స్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 5 బాలుర గురుకుల పాఠశాలలు, 4 బాలికల గురుకుల పాఠశాలలలో ఈ నెల 20వ తేదీ నాటికి వివిధ కమ్యూనిటీ/క్యాస్ట్ కేటగిరీలలో అందుబాటులో ఉండే ఖాళీల ఆధారంగా అదే రోజు స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. VTG CET/BLV CET–2026 ప్రవేశ పరీక్షకు హాజరైన బాలబాలికలు మాత్రమే ఈ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, ఆర్ఫన్, సెమీ-ఆర్ఫన్ బాలబాలికలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. అర్హత కలిగిన బాలబాలికలు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో స్వయంగా హాజరై దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెరిట్ జాబితా రూపొందించబడుతుందని, అనంతరం జిల్లాలోని 9 గురుకుల పాఠశాలలలోని 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు వివిధ కమ్యూనిటీ/క్యాస్ట్ కేటగిరీలలో అందుబాటులో ఉన్న ఖాళీలను నిబంధనల ప్రకారం భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. కమ్యూనిటీకి చెందిన ఆర్ఫన్, సెమీ-ఆర్ఫన్ విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించిన అనంతరం, మిగిలిన ఖాళీలను VTG CET/BLV CET–2026 ర్యాంక్ కార్డులోని మెరిట్ క్రమం ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుతో పాటు VTG CET/BLV CET–2026 ర్యాంక్ కార్డు, కులం/కమ్యూనిటీ సర్టిఫికెట్, బోనఫైడ్ సర్టిఫికెట్, ఆర్ఫన్, సెమీ-ఆర్ఫన్ కు సంబంధించిన ధ్రువపత్రాలు, ఇతర సంబంధిత ధ్రువపత్రాలు జత చేయాలని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.