ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 09 October 2026, 4:16 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

సుప్రీం కోర్టు తీర్పు – స్థానిక ఎన్నికలకు షెడ్యూల్..

సుప్రీం కోర్టు తీర్పు – స్థానిక ఎన్నికలకు షెడ్యూల్..

 న్యూఢిల్లీ:అర్జున్ సమాచారం డెస్క్ అక్టోబరు 9.

స్థానిక ఎన్నికల షెడ్యూల్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. సుప్రీం కోర్టులో బీసీ రిజర్వేషన్ల పైన నిర్ణయం వెలువడింది. హైకోర్టు తీర్పునే సుప్రీం సమర్థించింది.ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను

తిరస్కరించింది. ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. షెడ్యూల్ ప్రకటించేలా ఎన్నికల సంఘం తుది కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ల పైన అంచనాలు సిద్దం అయినట్లు తెలుస్తోంది. దీంతో.. రాష్ట్రంలో

ఎన్నికల సమరం మొదలు కానుంది.

బీసీ రిజర్వేషన్ల పై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. 34 శాతం బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన

పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు… రిజర్వేషన్లు 50 శాతం మించరాదని తేల్చి చెప్పింది. ఎన్నికల నిర్వహణ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నిర్దేశించిన గడువు లోగా ఎన్నికలు నిర్వహించేలా సుప్రీంకోర్టు

స్పష్టత ఇచ్చింది.దీంతో…స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు సహచర మంత్రులకు సీఎం చంద్రబాబు సైతం స్పష్టం చేశారు. ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం

లేదా 12వ తేదీన నోటిఫికేషన్‌ రావడం ఖాయమని మంత్రివర్గ భేటీలోనే వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కూటమి ఐక్యతకు భంగం కలిగించకుండా

వ్యవహరించాలని ఆదేశించారు. పట్టణ స్థానిక సంస్థలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే ఆలోచన ఉందన్నారు.

కాగా, స్థానిక ఎన్నికల ప్రక్రియ నవంబరు నెలాఖరుకు ముగుస్తుందని తెలిపారు. దీంతో..

నవంబర్ ద్వితీయార్ధంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.కాగా, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల పైన పూర్తి సమాయత్తం అవుతోంది. ఎన్నికల

ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిస్థితులపై సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దిశా నిర్దేశం చేసింది.ఓటర్ల జాబితా

తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఎన్నికల సిబ్బంది నియామకం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అంశాలపై కమిషన్ అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో

నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణపై ఈ సమావేశంలో జిల్లా యంత్రాంగానికి ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో, ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అటు

రాజకీయ పార్టీలు సైతం షెడ్యూల్ వేళ అప్రమత్తం అవుతున్నాయి.