‘SYG’ (సంబరాల ఏటి గట్టు) సినిమా షూటింగ్ పూర్తి
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సంబరాల ఏటి గట్టు’ (ఎస్‌వైజీ) షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో కీలక మైలురాయిని చేరుకుంది. బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ చిత్రాన్ని నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో ఇప్పటివరకు తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇది. ఈ సుదీర్ఘమైన, కష్టతరమైన ప్రయాణం ముగిసిన సందర్భంగా...