ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 8:03 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి,ACMO పి. ఉద్ధవ్.

ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలి,
ACMO పి. ఉద్ధవ్.

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: అర్జున్ సమాచారం ప్రతినిధి నవంబర్ 19.

గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విధిగా సమయపాలన పాటిస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని గిరిజన సంక్షేమ శాఖ అకాడమిక్ మానిటరింగ్ మొబిలైజింగ్ ఆఫీసర్ (ACMO) పి. ఉద్ధవ్ సూచించారు.
గురువారం దంతన్‌పల్లి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని పలు గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని భీమ్‌జీగూడ, బుగ్గగూడ, చింతనమాదర, మర్కగూడ, నాగుగూడ పాఠశాలలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు.
విద్యార్థుల అభ్యసన స్థాయిని మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయపాలన పాటిస్తూ, బోధనా ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలను పూర్తి చేయాలని తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను నిరంతరం అంచనా వేస్తూ, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి విద్యార్థి మెరుగైన విద్యా ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని కోరారు.
ఈ పర్యటనలో ఎస్ సి ఆర్ పి కనక కైలాస్ పాల్గొన్నారు.